హిందీలో “పుష్ప 2” సంచలనం.. ఒక్క వారంలోనే 400 కోట్ల క్లబ్ లోకి..

హిందీలో “పుష్ప 2” సంచలనం.. ఒక్క వారంలోనే 400 కోట్ల క్లబ్ లోకి..

Published on Dec 12, 2024 2:00 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇండియా వైడ్ గా భారీ హిట్ అయ్యి రికార్డ్ వసూళ్లు అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ నెంబర్ 1000 కోట్ల గ్రాస్ ని అందుకొని దుమ్ము లేపింది.

ఇక లేటెస్ట్ గా వారం రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ వారం రన్ లోనే హిందీలో పుష్ప 2 భారీ వసూళ్లు అందుకుంది. ఇలా ఏడో రోజు పుష్ప 2 హిందీ బెల్ట్ లో 30 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా ఈ వసూళ్లతో కేవలం వారం లోనే 400 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయింది. దీనితో నార్త్ బెల్ట్ లో పుష్ప 2 మేనియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు