మొత్తానికి అట్టహాసంగా కీర్తి సురేష్ పెళ్లి.. పిక్స్ వైరల్

మొత్తానికి అట్టహాసంగా కీర్తి సురేష్ పెళ్లి.. పిక్స్ వైరల్

Published on Dec 12, 2024 3:08 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కోసం మన తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ప్రస్తుత తర మహానటి అనిపించుకుంది. ఇలా తెలుగు సహా తమిళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇపుడు తన పర్శనల్ లైఫ్ లో ఒక స్టెప్ తీసుకుంది. కొన్ని రోజులు కితమే తన ప్రేమ, పెళ్లి కోసం ఓపెన్ అయ్యిన కీర్తి ఇపుడు ఫైనల్ గా తన పెళ్లి చేసేసుకుంది.

తన చిరకాల ప్రేమికుడి ఆంటోనీని నేడు గోవాలో వివాహం చేసుకోగా ఆ పెళ్ళికి సంబంధించిన పలు బ్యూటిఫుల్ విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి ఇద్దరు నవ దంపతులు తమ ప్రేమ పెళ్లి ఆనందం వారి ముఖాల్లోనే కనిపిస్తుంది. ఇలా పలువురు సినీ ప్రముఖులు సహా కుటుంబీకుల సమక్షంలో వీరి పెళ్లి అట్టహాసంగా జరిగింది. దీనితో ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా సినీ ప్రముఖులు వీరికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు