కోలీవుడ్ సూపర్ స్టార్, అభిమానుల తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న అవైటెడ్ సినిమా ఇది కాగా మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ ని నేడు రజినీ పుట్టినరోజు కానుకగా అందిస్తామని తెలిపారు. మరి చెప్పినట్టే ఈ సాయంత్రం కూలీ నుంచి ఆ ట్రీట్ ఇచ్చారు.
మరి ఇది ఏ మాస్ గ్లింప్స్ లాంటిది వస్తుందేమో అనుకున్నారు కానీ లోకేష్ మాత్రం ఫ్యాన్స్ కి క్రేజీ కిక్ ఇచ్చే ట్రీట్ ఇచ్చాడు అని చెప్పాలి. అనిరుద్ ఇచ్చిన డాన్స్ ట్యూన్ దీనికి మించి రజినీకాంత్ ఎనర్జిటిక్ అండ్ స్టైలిష్ స్టెప్పులు చూస్తే ఫ్యాన్స్ కి ఈరోజు దీనికి మించిన గిఫ్ట్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మొత్తానికి అయితే రజిని ఫాన్స్ కి మాత్రం కూలీ మేకర్స్ మంచి ట్రీట్ అందించారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తుండగా మన టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి