ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో చేస్తున్న అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం నుంచి ఇపుడు మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. అలా ఆల్రెడీ మొట్ట మొదటిసారిగా యూఎస్ మార్కెట్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అనౌన్స్ చేశారు.
అయితే ఈ ఈవెంట్ కి లేటెస్ట్ గా పుష్ప 2 తో సంచలనం సెట్ చేసిన దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని లేటెస్ట్ బజ్ ఒకటి వచ్చింది. మరి దీనిని నిజం చేస్తూ మేకర్స్ ఇపుడు అధికారిక ప్రకటన అయితే ఇచ్చేసారు. ఈ డిసెంబర్ 21న జరగనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ ఈవెంట్ లో సుకుమార్ ఎలాంటి విషయాలు పంచుకుంటారో చూడాలి. ఇక వీరి కాంబినేషన్ లో ఓ సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే.
Blockbuster director #Sukumar garu to be the chief guest of the mega massive pre-release event in the USA! ????❤️????
????️ 21st DEC, 6:00 PM ONWARDS,
???? Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040Event By : @CharismaEntmt#GameChangerOnJAN10 ????
GlobalStar… pic.twitter.com/ynsjZculke
— Sri Venkateswara Creations (@SVC_official) December 12, 2024