బన్నీ అరెస్ట్‌పై నాని ట్వీట్

బన్నీ అరెస్ట్‌పై నాని ట్వీట్

Published on Dec 13, 2024 5:22 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ కావడంతో, ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ పరిణామంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన విషాదకరమని.. అయితే, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోవద్దని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే, బన్నీ అరెస్ట్‌పై పలువురు సెలెబ్రిటీలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఈ ఘటనకు ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని బన్నీకి తన సపోర్ట్‌ను తెలిపాడు.

తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా బన్నీ అరెస్ట్‌పై స్పందించాడు. ‘సినిమా పరిశ్రమకు చెందిన వారి విషయంలో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపిస్తున్న ఆసక్తి సామాన్యుల విషయంలోనూ చూపిస్తే బాగుంటుంది. ఆరోజు జరిగిన ఘటన విషాదకరం.. అలా జరగాలని ఎవరూ కోరుకోరు. ఆ ప్రమాదం నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకోవాలి. ఈ ఘటనకు అందరూ బాధ్యులే. ఒక్క వ్యక్తి వల్ల జరిగిన ప్రమాదం కాదు ఇది.’ అని నాని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు