స్టార్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం.. పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించడం.. ఇలా తక్కువ సమయంలోనే అల్లు అర్జున్ జైలుకు వెళ్లాడు. అయితే, ఆ వెంటనే హై కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అభిమానులు సంతోషించారు. కానీ, వారి సంతోషం ఎక్కువ సేపు లేనట్లుగా కనిపిస్తోంది.
హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా, అల్లు అర్జున్ మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు. పోలీస్ అధికారులు తమకు ఇంకా బెయిల్ కాపీ రాలేదని.. వచ్చిన కాపీలో తప్పులు ఉండటంతో, సరైన బెయిల్ కాపీ వచ్చాకే అల్లు అర్జున్‌ను విడుదల చేస్తామని వారు తెలిపారు. దీంతో ఇవాళ రాత్రి అల్లు అర్జున్ జైల్లో ఉండే పరిస్థితి నెలకొంది. మరి అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు జైలు నుంచి విడుదల అవుతాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.