అక్కడ “గేమ్ ఛేంజర్” బుకింగ్స్ మొదలు..

అక్కడ “గేమ్ ఛేంజర్” బుకింగ్స్ మొదలు..

Published on Dec 14, 2024 11:10 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో చేస్తున్న చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు సినిమా రిలీజ్ కి సమయం దగ్గరకి వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ యూకే లో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా బుకింగ్స్ ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఓవర్సీస్ బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేసారు. మరి యూఎస్ సహా ఇతర దేశాల్లో బుకింగ్స్ ఏ లెవెల్లో ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఓవర్సీస్ లో జనవరి 9 నుంచే రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు