స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా ఈ సినిమా నుండి వచ్చిన వీడియో గ్లింప్స్‌తో ఈ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఘాటి చిత్ర రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నట్లు.. ఈ అనౌన్స్‌మెంట్‌ను డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వారు వెల్లడించారు.
దీంతో ‘ఘాటి’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడుంటుందా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.