హీరో అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. సుబ్బు నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. మజ్ను సినిమా చేస్తున్నప్పుడు తను నా వన్ మేన్ ఆర్మీ. ఏ అవసరం ఉన్నా తననే అడిగేవాణ్ణి. ఆ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ తనది కూడా. బచ్చల మల్లి చూసినప్పుడు సుబ్బుకి తన బలం దొరికిందని అనిపించింది. సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి బెస్ట్ విషెస్. సుబ్బు ట్రైలర్ లోనే కథ చెప్పాలనుకున్నాడు అంటే సినిమాలో ఇంకెంత హానెస్ట్ గా ప్రయత్నించి ఉంటాడో నేను ఊహించగలను. అమృత ఆల్ ది వెరీ బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే.’ అని అన్నారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..‘థాంక్యూ నాని. తనకి థాంక్యూ చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. తను నాకు ఫ్యామిలీ. 16 ఇయర్స్ నుంచి మా జర్నీ కొనసాగుతుంది. లో టైం లో ఉన్నప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే. సుబ్బు ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పారో అంతే అద్భుతంగా ఈ సినిమాని తీశారు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. నాకు ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ’ అని అన్నారు.
డైరెక్టర్ సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ..‘ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన నాని గారికి థాంక్యూ. నేను సోలో బ్రతుకు కథ ఆయనకి చెప్పాను. ఆయన చాలా అద్భుతమైన ఇన్పుట్ ఇచ్చారు. ఆయన ఈవెంట్ కి రావడమే ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసాననే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం నరేష్ గారు. నేను రాసిన దాన్ని ఆయన అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఇంత గ్రాండ్ గా వచ్చింది. అమృత కావేరి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. హాస్య మూవీ ప్రొడక్షన్ టీం అందరికీ థాంక్యూ’ అని అన్నారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అమృత అయ్యర్, చిత్ర నిర్మాత రాజేష్ దండా, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.