మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

Published on Dec 15, 2024 2:59 AM IST

టాలీవుడ్‌లో ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మ్యాడ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సీక్వెల్ మూవీకి ‘మ్యాడ్ స్క్వేర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేయగా, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయాలని భావించినా.. ఆ నెలలో పలు చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఫార్చున్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు