వరల్డ్ వరల్డ్ వైడ్ “పుష్ప 2” లేటెస్ట్ రికార్డు వసూళ్లు..

వరల్డ్ వరల్డ్ వైడ్ “పుష్ప 2” లేటెస్ట్ రికార్డు వసూళ్లు..

Published on Dec 15, 2024 5:47 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపింది. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్, తన విడుదల నేపథ్యంలో మేకర్స్ అఫీషియల్ నెంబర్స్ వేయడం ఈ రేండు రోజులు ఆపారు కానీ బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ తాండవం ఎక్కడా ఆగలేదు అని చెప్పాలి.

ఇలా పది రోజులు రన్ ని వరల్డ్ వైడ్ కంప్లీట్ చేసుకున్న పుష్ప 2 ఇపుడు ఈ ఏడాదిలో ఆల్ టైం హైయెస్ట్ రికార్డు వసూళ్లు అందుకుంది. మరి ఈ 10 రోజుల్లో 1292 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 2024 లో ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది. మొత్తానికి భారీ రికార్డుని పుష్ప 2 సెట్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు