మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ సంగీతం అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ వికటకవి నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడతో స్పెషల్ చిట్ చాట్…
ముందుగా మీ నేపథ్యం గురించి చెప్పండి ?
నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్రమంలో నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది.
మీకు మ్యూజిక్ అంటే ఆసక్తి ఎందుకు?
మా ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను.
సినీ రంగంలోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు?
ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారు. నేను అంతకు ముందు చేసిన ఓ ముప్పై సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది. నేను సంగీతం ఇచ్చిన ఆయ్ సినిమా హిట్ అవ్వడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
పీరియాడిక్ సిరీస్ వికటకవి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ?
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి ఏం కావాలనే దానిపై పక్కా క్లారిటీ ఉంది. అందువల్ల నేను వికటకవి సిరీస్‌కు వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా కష్టపడలేదు. డైరెక్టర్సే నాకు గురువులు. అందువల్ల డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తూ వెళ్లానంతే. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే. నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. త్రీరోజెస్ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను.