“బిగ్ బాస్ 8” విన్నర్ గా నిఖిల్.. ఆల్ టైం హైయెస్ట్ ప్రైజ్ మనీతో

“బిగ్ బాస్ 8” విన్నర్ గా నిఖిల్.. ఆల్ టైం హైయెస్ట్ ప్రైజ్ మనీతో

Published on Dec 15, 2024 11:08 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఇండియా లోనే అన్ని భాషల్లో కంటే మన తెలుగులో మాత్రమే అత్యధిక రేటింగ్స్ తెచ్చుకున్న షోగా దీనికి తెలుగులో మంచి ఆదరణ ఉంది. అయితే ఇపుడు వరకు 7 సీజన్లు వరుసగా విజయవంతంగా తెలుగు ఆడియెన్స్ ని అలరించాయి.

అలాగే ఇపుడు ఫైనల్ గా ఎనిమిదో సీజన్ కూడా ముగిసిపోయింది. మరి ఈసారి టాప్ 3 లో నబీల్, గౌతమ్, నిఖిల్ లు నిలవగా అనేకమంది సినీ ప్రముఖులు గెస్ట్ లుగా వచ్చిన ఈ షో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెన్స్ తో ముగిసింది. మరి టాప్ 2 లో వచ్చిన గౌతమ్, నిఖిల్ లలో కింగ్ నాగార్జున నిఖిల్ ని ఈసారి విన్నర్ గా ప్రకటించి ఉత్కంఠకి తెర దించేశారు.

దీనితో బిగ్ బాస్ 8 టైటిల్ ని గ్లోబల్ స్టార్ చేతులు మీదుగా నిఖిల్ అందుకోగా ఏ సీజన్లో లేని విధంగా 55 లక్షల ప్రైజ్ మనీని నిఖిల్ గెలుచుకున్నట్టుగా నాగ్ ప్రకటించారు. ఇలా మొత్తానికి అయితే బిగ్ బాస్ 8 సీజన్ కూడా విజయవంతంగా ముగిసిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు