సస్పెన్స్‌తో ‘డెకాయిట్’ సాలిడ్ అప్డేట్.. ఇంతకీ తనెవరు..?

సస్పెన్స్‌తో ‘డెకాయిట్’ సాలిడ్ అప్డేట్.. ఇంతకీ తనెవరు..?

Published on Dec 16, 2024 5:01 PM IST

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం పలు సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న అడివి శేష్, ‘డెకాయిట్’ అనే మరో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను షేనియల్ డియో డైరెక్ట్ చేస్తుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

‘డెకాయిట్’ చిత్రంలో ఓ ప్రేమ కథ కూడా ఉందని.. ఈ సినిమాలో హీరో అడివి శేష్ ఎవరిని ప్రేమిస్తున్నాడు అనేది చిత్ర యూనిట్ సస్పెన్స్‌గా పెట్టారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘తనని కాపాడినా.. కానీ ఒదిలేసినాది.. తను ఏంటో.. అసలెవరో.. రేపు తెలుస్తాది..’’ అంటూ హీరో అడివి శేష్ ఈ చిత్రంలోని హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాడు. ఇక హీరోయిన్ ముఖం రివీల్ కాకుండా కేవలం కళ్ల వరకు కనిపించేలా ఈ కొత్త పోస్టర్ ఉండటంతో అభిమానులు ఈ హీరోయిన్ ఎవరా.. అని ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, గతంలో ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుందని మేకర్స్ ప్రకటించినా, ఇప్పుడు ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ‘డెకాయిట్’ కొత్త పోస్టర్‌లో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో మీరు గెస్ చేయగలరా..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు