రీరిలీజ్ లో “ఇంటర్ స్టెల్లార్” భారీ రికార్డు..

రీరిలీజ్ లో “ఇంటర్ స్టెల్లార్” భారీ రికార్డు..

Published on Dec 17, 2024 8:00 AM IST

హాలీవుడ్ సినిమాల్లో ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకి ఒక ప్రత్యేక క్రేజ్ ఉందని చెప్పాలి. తను చేసిన మొదటి చిత్రం నుంచి ఇప్పుడు ప్రతీ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ కి ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్ ని అందించాయి. మరి ఇలా తను చేసిన పలు క్లాసిక్ చిత్రాల్లో ఎమోషనల్ సై ఫై థ్రిల్లర్ చిత్రం “ఇంటర్ స్టెల్లార్” కూడా ఒకటి.

అప్పుడులో కూడా థియేటర్స్ లో అదరగొట్టిన ఈ చిత్రం లేటెస్ట్ గా ఐమ్యాక్స్ రీ రిలీజ్ కి మళ్లీ వచ్చింది. మరి ఇలా వచ్చిన సినిమా వరల్డ్ వైడ్ ఐమ్యాక్స్ రీ రిలీజ్ లలో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకున్నట్టుగా హాలీవుడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి ఈ డిసెంబర్ 6న మన దేశంలో తప్ప బయట అంతా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు ఐమ్యాక్స్ లో హైయెస్ట్ గ్రాస్ ని అందుకుని టాప్ లో నిలిచింది. ఇక ఈ సినిమా ఇండియాలో ఈ జనవరిలో ప్లాన్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు