మంచు నిర్మల మోహన్ బాబు నుంచి షాకింగ్ కంప్లైంట్

మంచు నిర్మల మోహన్ బాబు నుంచి షాకింగ్ కంప్లైంట్

Published on Dec 17, 2024 2:01 PM IST

రీసెంట్ గా మంచు వారి కుటుంబంలో జరుగుతున్న గొడవలు కోసం అందరికీ తెలిసిందే. మంచు మోహన్ బాబు అలాగే తన కొడుకులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ల విషయంలో పలు కారణాలు రీత్యా చేసిన ఆరోపణలు ఇపుడు టాలీవుడ్ లో హిట్ టాపిక్ గా మారుతూ వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రీసెంట్ గానే మంచు మనోజ్ ఇంటికి విష్ణు వచ్చి తమ ఇంటి దగ్గర జెనరేటర్స్ లో పంచదార పోసి కరెంట్ పోయేలా చేసాడు అని ఓ షాకింగ్ వీడియో ఫుటేజ్ లీక్ చేసాడు.

అయ్యితే దీనిపై వారి మాతృమూర్తి మంచు నిర్మలా మోహన్ బాబు నుంచి వచ్చిన కంప్లైంట్ నోట్ ఇపుడు షాకింగ్ గా మారింది. డైరెక్ట్ పహాడీ షరీఫ్ పోలీస్ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇది కాగా ఇందులో మొన్న డిసెంబర్ 14న నా కొడుకు మంచు విష్ణు నా పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చిన విజువల్స్ ని నా రెండో కుమారుడు మంచు మనోజ్ బయట పెట్టి విష్ణు గొడవ చేసినట్టుగా లేని పోనీ అభాండాలు వేసి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది.

విష్ణు కేక్ తెచ్చి కట్ చేయించి నాతో మాట్లాడి కాసేపు ఉండి తనకి కావాల్సిన కొన్ని సమన్లు తీసుకెళ్లాడు అని తెలిపారు. అలాగే ఇంట్లో పని వాళ్ళు కూడా తమంత తాము మానేశారు తప్ప విష్ణు బలవంతం లేదు అని విష్ణు వచ్చాడు తన పని చూసుకుని వెళ్ళిపోయాడు తప్ప అందులో ఏం లేదని ఆమె తెలిపారు. దీనితో ఈ కంప్లైంట్ నోట్ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు