‘రాజా సాబ్’ ఆగమనం ఆలస్యమేనా..?

‘రాజా సాబ్’ ఆగమనం ఆలస్యమేనా..?

Published on Dec 18, 2024 1:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేయగా, పూర్తి హార్రర్ కామెడీ జోనర్‌లో ‘ది రాజా సాబ్’ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే, ‘రాజా సాబ్’ ఆగమనం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఇటీవల ప్రభాస్‌కు షూటింగ్‌లో గాయం కావడంతో ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇప్పట్లో సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడని సినీ వర్గాల టాక్. దీని ప్రకారం ది రాజా సాబ్ బ్యాలెన్స్ షూటింగ్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోవడం.. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోవడం వంటివి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి నిజంగానే రాజా సాబ్ మూవీ రిలీజ్ ఆలస్యం కానుందా.. అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు