టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు.
ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని రీసెంట్‌గా ఓకే చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను డిసెంబర్ 19న అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ‘బచ్చల మల్లి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ తన నెక్స్ట్ మూవీ టైటిల్‌ను రివీల్ చేసేశాడు. ఈ సినిమాకు ‘క ర్యాంప్’ అనే టైటిల్ పెట్టినట్లుగా ఆయన తెలిపాడు.
దీంతో ఈ సినిమాకు సాలిడ్ టైటిల్ పెట్టారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర నిజంగానే ‘క ర్యాంప్’ ఖాయమని కిరణ్ అబ్బవరం అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తోంది.