300 రోజులుగా ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎక్కడంటే..?

300 రోజులుగా ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎక్కడంటే..?

Published on Dec 18, 2024 2:28 AM IST

పాన్ ఇండియా స్టార ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ప్రభాస్ లుక్స్ మొదలుకొని, ఆయన చేసిన యాక్షన్ సీక్వె్న్స్‌ల వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా నార్త్‌లో సలార్ చిత్రానికి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని హిందీలో డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు కంటిన్యూ ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఏకంగా 300 రోజుల పాటు ఈ మూవీ ట్రెండింగ్ అవుతుందంటే ఇది మామూలు విషయం కాదని.. ఈ సినిమా నార్త్ ఆడియెన్స్‌కి ఏ రేంజ్‌లో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటించాడు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు