టాక్.. “ఓజి”లో రాధిక నిజమేనా!?

టాక్.. “ఓజి”లో రాధిక నిజమేనా!?

Published on Dec 18, 2024 11:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ సహా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా “హరిహర వీరమల్లు” సినిమాలో పవన్ బిజీగా ఉండగా ఈ సినిమా కాకుండా దర్శకుడు సుజీత్ తో భారీ చిత్రం “ఓజి” లో కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా దాదాపు పూర్తయ్యింది కానీ పవన్ డేట్స్ మూలాన ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక రీసెంట్ గానే మేకర్స్ పవన్ లేని సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ సినిమా విషయంలో వినిపిస్తుంది.

దీనితో ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో షైన్ అవుతుంది అని టాక్. మరి డీజే టిల్లు అలాగే టిల్లు స్క్వేర్ చిత్రాల్లో రాధికాగా అదరగొట్టిన ఈ యంగ్ బ్యూటీ ఓజి లో ఛాన్స్ అందుకోవడం అంటే తన కెరీర్ లో బిగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. మరి ఈమె ప్రెజెన్స్ నిజంగా ఈ సినిమాలో ఉందో లేదో అనేది అఫీషియల్ క్లారిటీ వస్తే తెలుస్తుంది. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు