సమీక్ష: “ముఫాసా – ది లయన్ కింగ్” – తక్కువ అంచనాలతో ట్రై చెయ్యండి

సమీక్ష: “ముఫాసా – ది లయన్ కింగ్” – తక్కువ అంచనాలతో ట్రై చెయ్యండి

Published on Dec 21, 2024 1:15 AM IST
Mufasa The Lion King Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 20, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మహేష్ బాబు(ముఫాసా), బ్రహ్మానందం(పుంబా), అలీ(టిమోన్), సత్య దేవ్(టాకా), అయ్యప్ప పి శర్మ(కిరోస్) తదితరులు

దర్శకుడు : బ్యారీ జెన్‌కిన్స్

నిర్మాతలు : అడీల్ రొమన్స్‌కి, మార్క్ సీర్యక్

సంగీత దర్శకులు : లిన్ మాన్యుయెల్ మిరండా, హాన్స్ జిమర్, డేవ్ మెజిగర్

సినిమాటోగ్రఫీ : జేమ్స్ లాక్స్‌టన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్‌లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ముఫాసా – ది లయన్ కింగ్’ కూడా ఒకటి. మరి మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, ఆడియన్స్‌ని ఏ మేరకు అలరించిందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే.. ఈ భూమ్మీద ఉన్న విశాల ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా చూడని ఓ బీడువాడిన ప్రాంతంలో ముఫాసా ఇంకా తన తల్లిదండ్రులు(సింహాలు) నివాసం ఉంటాయి. అయితే ముఫాసాకి తన తల్లి సింహం చెప్పిన ఓ ప్రత్యేక ప్రాంతం మిలైలేకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తమ ప్రాంతంలో వచ్చిన ఒక్కసారి వర్షంతో భారీ వరదల మూలాన ముఫాసా తన తల్లిదండ్రులకు దూరం అయ్యిపోతాడు. అలా అక్కడ నుంచి ఎంతో దూరం వెళ్లి మరో ప్రాంతం, జాతి సింహాల దగ్గరకి దారి తప్పుతాడు. అక్కడే పరిచయం అయ్యిన ఓ చిన్న సింహం (టాకా) ముఫాసాని చేరదీసి తన కుటుంబం లోకి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి ముఫాసా ప్రయాణం ఎలా సాగింది. తను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఆ జాతి ముఫాసాని చేరదీసిందా లేదా? వారికి మరో జాతి సింహాలు మూలాన వచ్చిన ప్రమాదం ఏమిటి? ఆఖరికి ముఫాసా తన చెప్పిన ప్రాంతానికి చేరుకున్నాడా లేదా? తను ఒక నాయకుడిగా ఎలా మారాడు తన ప్రాణ స్నేహితుడు స్కార్ గా ఎలా మారాడు అనే ప్రయాణమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్:

డిస్నీ వారి నుంచి వచ్చిన ఫేమస్ కామిక్స్ లో ఈ ది లయన్ కింగ్, జంగిల్ బుక్ లాంటి వాటికి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో లాస్ట్ గా వచ్చిన సినిమా ది లయన్ కింగ్ మంచి హిట్ అయ్యింది. అయితే దానికి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో కూడా అలరించే అంశాలు కొన్ని ఉన్నాయి.

మెయిన్ గా ముఫాసా జర్నీ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తన నైపుణ్యాలు, ఒక నాయకుడిగా ఎలా మారింది అనే ప్రయాణం సినిమాలో డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే ఇతర సింహాలతో పలు పోరాట సన్నివేశాలు సాలిడ్ గా ఉన్నాయి. అలాగే ముఫాసా సింహం పాత్రకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ మంచి ప్లస్ అని చెప్పాలి.

సన్నివేశాలకు తగ్గట్టుగా మహేష్ పలికించిన డైలాగ్ లు ఆ ముఫాసా సింహానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యినట్టుగా కనిపిస్తాయి. అలాగే బ్రహ్మానందం, ఆలీల డబ్బింగ్ లో సాగే టిమోన్ అండ్ పుంబాపై పలు కామెడీ సీన్స్ కొంచెం నవ్వు తెప్పిస్తాయి. అలాగే లైవ్ మోషన్ కాప్చర్ లో తీసిన ఈ సినిమాలో విజువల్స్ ఎంతో గ్రాండ్ గా చూసేందుకు అందంగా నాచురల్ గా కనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

నిజానికి ఈ కథ ఎన్నో ఏళ్ల కిందిదే కావచ్చు కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ లో ఎన్నో సినిమాలు చూసిన వారికి మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా అనిపిస్తుంది అని చెప్పక తప్పదు. ఇంకా దీనికంటే ముందు వచ్చిన లయన్ కింగ్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా ఈ సినిమాలో లోపించాయి.

టిమోన్, పుంబా ట్రాక్‌కి ఇంకా మంచి ఫన్ సన్నివేశాలు ఏమన్నా పెట్టి ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ తో పాటుగా యువ నటుడు సత్యదేవ్ కూడా డబ్బింగ్ చెప్పాడు కానీ తెలుగులో మాత్రం డబ్బింగ్ విలువలు బాగోలేవో లేక తానే మాడ్యులేషన్ మార్చి చెప్పాడో కానీ.. చాలా సీన్స్ లో ఈ గొంతు తనదే అని అర్ధం కాదు.

అలాగే పోరాట సన్నివేశాలు లాంటివి ఇంకొంచెం అగ్రెసివ్ గా మాంచి హై మూమెంట్స్ ఇచ్చేలా కూడా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇలా చాలా కోణాల్లో ఆడియెన్స్‌ని థ్రిల్ చేసే స్కోప్‌ని మేకర్స్ మిస్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలు కూడా ఒకింత బోర్ ఫీల్ కలిగిస్తాయి.

సాంకేతిక వర్గం:

హాలీవుడ్ సినిమాల్లో నిర్మాణ విలువలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే గత సినిమాకి కూడా చాలా నాచురల్ విజువల్స్ గ్రాఫిక్స్ రూపేణా చూపించారు కానీ ఇప్పుడు సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ వర్క్ అంత నాచురల్ గా కనిపించలేదు. మిగతా సీన్స్ అంతా చాలా అందంగా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ బాగానే ఉంది. సినిమా ఫోటో రియలిస్టిక్ లోనే కాబట్టి దర్శకుడు, సినిమాటోగ్రఫర్ ల విజన్ కి తగ్గట్టుగా చూపించిన పలు విజువల్స్ వావ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ బానే ఉంది. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి.

ఇక దర్శకుడు బ్యారీ జెన్‌కిన్స్ విషయానికి వస్తే.. ముఫాసా – ది లయన్ కింగ్ కథని బాగానే అడాప్ట్ చేసుకున్నారు కానీ ఇది ఇంకా ఎంగేజింగ్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. మరిన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ జోడించి అలాగే యాక్షన్ మూమెంట్స్ ని కూడా ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉండుంటే ఒక ప్యాకెడ్ ఎంటర్టైనర్ లా ఇది నిలిచేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ “ముఫాసా – ది లయన్ కింగ్” చిత్రం అంచనాలు పూర్తి స్థాయిలో అందుకోలేదు అని చెప్పక తప్పదు. మహేష్ డబ్బింగ్ తెలుగు వెర్షన్ లో బాగా ప్లస్ కాగా కొన్ని గ్రాండ్ విజువల్స్ అవీ పిల్లల వరకు కొంతమేర అలరించవచ్చు కానీ ఇంకా కథనం మంచి ఎంటర్టైనింగ్ గా గ్రిప్పింగ్ గా ఉండుంటే బాగుండేది. వీటితో ఈ చిత్రాన్ని చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు