గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రం తాలూకా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ లో ఇపుడు జరుగుతుంది. ఇక ఈ ఈవెంట్ తర్వాత మన తెలుగు స్టేట్స్ లో రెండు గ్రాండ్ ఈవెంట్స్ కి సన్నాహాలు మేకర్స్ చేస్తున్నారు.
మరి ఆల్రెడీ ఏపీలో జరిగే భారీ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్నారని వార్తలు ఉన్నాయి. కానీ ఇపుడు మరో సాలిడ్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీని ప్రకారం గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి వస్తారని తెలుస్తుంది. ఈ డిసెంబర్ 27న ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తుండగా ఆ ట్రైలర్ ని మెగాస్టార్ సారథ్యంలో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.