పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా నేటికి ఏడాది కావడంతో సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ అండ్ చిత్ర యూనిట్ కూడా ఆ వైబ్స్ లో ఉన్నారు. అయితే దీనికి సీక్వెల్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కోసం అందరికీ తెలిసిందే.
మరి దీనిపై మంచి హైప్ నెలకొనగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా రిలీజ్ సాలిడ్ క్లారిటీ మేకర్స్ ఇచ్చేసారు. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ని రానున్న ఏడాది 2026లో తీసుకొస్తున్నట్టుగా లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. దీనితో రెబల్ ఫ్యాన్స్ ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం అప్పుడు వరకు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి. మరి ఆ సినిమా ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్, పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.