కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారని.. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ మహల్ సెట్ ను వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ మహల్ సెట్ లోనే ‘ది రాజా సాబ్’ క్లైమాక్స్ లోని కీలక భాగాన్ని షూట్ చేస్తారట.
ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది.