పోరాడుతూ మరణిస్తా – తాప్సీ

పోరాడుతూ మరణిస్తా – తాప్సీ

Published on Dec 23, 2024 2:01 PM IST

గ్లామర్ బ్యూటీ తాప్సీ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. తాజాగా తాప్సీ తన కొత్త సినిమా గాంధారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. దర్శకుడు దేవాశిశ్‌ మఖిజా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన అప్ డేట్స్ ను తాప్సీ నెటిజన్స్ తో పంచుకుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా షూట్ మొదలైనట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోల్ని షేర్ చేసింది. పైగా ‘సమయం వచ్చినప్పుడు నేను యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతూ మరణించాలి. కానీ ఎప్పుడూ శత్రువుల ముందు భయం ప్రదర్శించొద్దు. ఇప్పుడు పోరాటం ప్రారంభిద్దాం’ అని ఓ లైన్ ను కూడా తాప్సీ రాసింది. మొత్తానికి ఈ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే ఓ శక్తిమంతమైన తల్లిగా తాప్సీ కనిపించనుందని అర్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని కనికా థిల్లాన్‌ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు