కలెక్షన్ల దుమ్ము రేపుతున్న “మార్కో”

కలెక్షన్ల దుమ్ము రేపుతున్న “మార్కో”

Published on Dec 23, 2024 7:36 AM IST

మన భారతీయ సినిమా రంగానికి చెందిన 1000 కోట్ల క్లబ్బులో… హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను “మార్కో” తీసుకుంది. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తుండగా… తొలిసారి హిందీలో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న “మార్కో” అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో “క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్” పతాకంపై షరీఫ్ మహ్మద్ నిర్మించారు.

తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ కు లభిస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని… మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు “జినీవర్స్” సంస్థ సన్నాహాలు చేస్తోంది. “జినీవర్స్” అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ… “బాహుబలి, కె.జి.ఎఫ్, కాంతరా… తాజాగా పుష్ప-2” చిత్రాల గురించి మాట్లాడుకున్నట్లుగా… “మార్కో” గురించి మాట్లాడుకుంటారని కచ్చితంగా చెప్పగలను. మన రెండు తెలుగు రాష్ట్రాలలో “మార్కో” హిందీ వెర్షన్ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే రేపటి నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు