ఇటీవల భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ కుటుంబంలో చితికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో శ్రీతేజ్ అనే బాలుడు గత కొన్ని రోజులు నుంచి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ వచ్చాడు.
మరి రీసెంట్ గానే సినీ నటుడు జగపతి బాబు ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించినట్టుగా రివీల్ చేశారు. కానీ తాజాగా శ్రీతేజ్ ని పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ అలాగే సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి కలిశారు. దీనితో శ్రీతేజ్ కుటుంబాన్ని వీరు పరామర్శించగా తాను నిర్మాత వారి కుటుంబానికి ఆర్ధిక సాయంగా 50 లక్షల చెక్ ని బాబుకి తన తండ్రికి కలిపి అందించారు.
అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని ఇక ఎక్కడా రాజకీయం చేయొద్దు అని అలాగే సినిమాల హీరోల ఇళ్లపై దాడులు చేయకూడదు అని సూచించారు. అలాగే సినిమా పరిశ్రమ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే వార్తల్లో నిజం లేదని ఎవరి పైన అయినా ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కోమటిరెడ్డి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.