“గేమ్ ఛేంజర్”తో “దేవర” క్రేజీ స్నాప్ వైరల్..

“గేమ్ ఛేంజర్”తో “దేవర” క్రేజీ స్నాప్ వైరల్..

Published on Dec 23, 2024 10:59 PM IST

మన టాలీవుడ్ ప్రెజెంట్ జెనరేషన్ లో బిగ్గెస్ట్ మాస్ మల్టీ స్టారర్ సినిమా ఈ మధ్య కాలంలో ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన “రౌద్రం రణం రుధిరం” అని చెప్పాలి. మరి ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ఈ సినిమాతో బయట కూడా తారక్, రామ్ చరణ్ లు ఎంత మంచి స్నేహితులు అనేది కూడా అందరికీ అర్ధం అయ్యింది.

అయితే ఆ సినిమా తర్వాత తారక్ భారీ సినిమా “దేవర” చేయగా రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” స్టార్ట్ చేసాడు. అయితే దేవర వచ్చి ఆల్రెడీ హిట్ అయ్యింది. కానీ గేమ్ ఛేంజర్ ఇపుడు రాబోతుంది. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సాలిడ్ ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మెగా మాస్ ఫ్రేమ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దుబాయ్ లో రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లతో కలిసి సంగీత దర్శకుడు థమన్ తీసుకున్న క్రేజీ పిక్ ఒకటి ఇపుడు వైరల్ గా మారింది. దీనితో అటు తారక్ ఫ్యాన్స్ లో అలాగే చరణ్ అభిమానుల్లో ఇది ఆనందాన్ని నింపింది. ఇక ఎన్టీఆర్ ఇపుడు వార్ 2 లో బిజీగా ఉండగా చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు