టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించిన ఎగ్జిబిటర్స్

టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించిన ఎగ్జిబిటర్స్

Published on Dec 24, 2024 2:00 AM IST

లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర పలు భారీ చిత్రాలకి టికెట్ ధరల హైక్ అనే మాట తరచూ వింటూనే వస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమాలకి గాను వాటి బడ్జెట్ లు నిర్మాతల సౌలభ్యత కోసం ఉన్న ధరలపైనే భారీ మొత్తంలో హైక్ లు అందుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో రీసెంట్ గా పుష్ప 2 కి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు హైక్ దక్కింది.

కానీ దీనిపై పలు భిన్నాభిప్రాయాలు అయితే వచ్చాయి. దీనితో తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా టికెట్ ధరల్ని నియంత్రిస్తాం అని కూడా చెప్పింది. అయితే లేటెస్ట్ గా ఈ నిర్ణయాన్ని తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ ఆహ్వానించారు. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నట్టుగా లేటెస్ట్ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ విజేందర్ రెడ్డి అలాగే ఆంధ్ర ఎగ్జిబిటర్ల సెక్టార్ చైర్మన్ టి ఎస్ రామ్ ప్రసాద్ అలాగే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ లు ఆల్రెడీ ఈ టికెట్ ధరల విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అని మాట్లాడుకున్నాము అని ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు