ఎంటర్టైనింగ్ గా బాలయ్య, వెంకీ మామ ఎపిసోడ్ ప్రోమో

ఎంటర్టైనింగ్ గా బాలయ్య, వెంకీ మామ ఎపిసోడ్ ప్రోమో

Published on Dec 24, 2024 12:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే వెంకీ మామలు హీరోలుగా నటించిన అవైటెడ్ చిత్రాలు డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఈ సంక్రాంతికి వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ కాగా ఈ ఇద్దరు స్టార్స్ ఒకే వేదికపై ఎంటర్టైన్మెంట్ అందిస్తే ఎలా ఉంటుందో ఇపుడు కనిపిస్తుంది.

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో బాలయ్య హోస్ట్ చేస్తున్న క్రేజీ టాక్ షో అన్ స్టాప్పబుల్ లేటెస్ట్ సీజన్లో గెస్ట్ గా వెంకీ మామ రాగ ఈ ఎపిసోడ్ తాలుకా ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఇది ఆద్యంతం మంచి ఎంటర్టైనింగ్ గా సాగింది అని చెప్పాలి. బాలయ్య డైలాగులతో వెంకీ మామ, వెంకీ మామ డైలాగ్స్ తో బాలయ్య అదరగొట్టగా వెంకీ మామ సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఎపిసోడ్ లో వచ్చారు.

మరి వీరి నడుమ సాగిన ఓ ఎమోషనల్ కన్వర్జేషన్ కదిలించగా ఇది దర్శకుడు అనీల్ రావిపూడి ఒక సర్ప్రైజ్ అండ్ ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చి ఈ ఎపిసోడ్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చారని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ ఎపిసోడ్ ఈ డిసెంబర్ 27, సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కి రాబోతుంది మరి ఇదెలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు