మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ 12వ చిత్రం కూడా ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ అందించారు.
ప్రెజెంట్ కొనసాగుతున్న ట్రెండ్ లోనే ఈ సినిమాకి కూడా సాలిడ్ సీక్వెల్ ఉన్నట్టుగా ఇపుడు తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఇక అది కూడా గౌతమ్ లాంటి దర్శకుని నుంచి సీక్వెల్ అంటే మినిమమ్ అంచనాలు పెట్టుకోవచ్చు. మరి ఈ సినిమా టీజర్, గ్లింప్స్ లాంటివి త్వరలోనే రానున్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 28న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.