విడుదల తేదీ : డిసెంబర్ 25, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ, సియా గౌతమ్, మురళీధర్ గౌడ్, రవితేజ మహాదాస్యం.
దర్శకుడు : మోహన్
నిర్మాత : వెన్నపూస రమణా రెడ్డి
సంగీత దర్శకులు : గ్యాని, సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ : మల్లికార్జున నరగాని
కూర్పు: అవినాష్ గుల్లింక
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై కామెడీ థ్రిల్లర్ చిత్రం “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” కూడా ఒకటి. సినిమా నచ్చకపోతే తనకి కాల్ చెయ్యండి అని దర్శకుడు తన నెంబర్ కూడా ఇచ్చారు. మరి అంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇక కథ లోకి వస్తే.. షెర్లాక్ హోమ్స్ గా పిలవబడే ఓం ప్రకాష్(వెన్నెల కిషోర్) శ్రీకాకుళంలో ఓ డిటెక్టివ్ గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకి వైజాగ్ లో ఓ మర్డర్ కేసు సాల్వ్ చెయ్యమని ఛాలెంజింగ్ గా వస్తుంది. అయితే ఈ కేసులో తాను మొత్తం ఏడుగురు అనుమానితులు బాలకృష్ణ(రవితేజ మహాదాస్యం) అలాగే భ్రమరాంబ(అనన్య నాగళ్ళ) అలాగే రమేష్ పట్నాయక్(ప్రభాకర్) తదితరులని మార్క్ చేస్తాడు. మరి ఆ మర్డర్ లో చనిపోయింది ఎవరు? వారికీ ఈ ఏడుగురికి నిజంగానే సంబంధం ఉందా? ఎందుకు చంపారు? నిజంగానే ఓం ప్రకాష్ ఈ కేసు సాల్వ్ చేశాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఒక కమెడియన్ గానే కాకుండా మంచి నటుడుగా కూడా వెన్నెల కిషోర్ సాలిడ్ పెర్ఫామెన్స్ లని చాలా చిత్రాల్లో అందించాడు. మరి అలాగే ఈ సినిమాలో కూడా ఒక కామిక్ టచ్ ఉన్న డిటెక్టివ్ రోల్ లో తాను పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు అని చెప్పాలి. మంచి కామెడీ టైమింగ్ ఇన్వెస్టిగేషన్ లో సందర్భానుసారం కావాల్సిన ఎమోషన్స్ ని తాను బాగా పండించాడు అని చెప్పాలి.
ముఖ్యంగా తన శ్రీకాకుళం యాసలో మంచి ఎంటర్టైన్మెంట్ ని సినిమాలో అందించాడని చెప్పొచ్చు. అలాగే తన రోల్ సెకండాఫ్ మరింత ఇంప్రెస్ చేస్తుంది. మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ తన రోల్ లో షైన్ అయ్యిందని చెప్పొచ్చు. తన రోల్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ని ఆమె బాగా చేసింది. ముఖ్యంగా తన రోల్ ఒకానొక టైం ఆడియెన్స్ కి ఇరిటేషన్ తెప్పించే లెవెల్లో కూడా అనిపిస్తుంది.
అంటే ఆ రేంజ్ పీక్ పెర్ఫామెన్స్ ని ఆమె అందించింది అని చెప్పాలి. నటిగా తనని మరింత ఇంప్రూవ్ చేసుకుంటూ ఈమె వెళుతుంది. అలాగే ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన రవితేజ, ప్రభాకర్, భద్రం తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. అలాగే సినిమాలో కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరియు కామెడీ సీన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
సాధారణంగా ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకి ఇంట్రెస్టింగ్ కథాంశం దానికి అనుగుణంగా ఊహించని ట్విస్ట్ లు అవసరం ఉంటుంది కానీ ఈ సినిమాలో అది వీక్ గా కనిపిస్తుంది అన్ని చెప్పక తప్పదు. అలాగే సినిమాలో కిల్లర్ ఎవరు అనే సస్పెన్స్ ఫ్యాక్టర్ ని ఎక్కువసేపు హోల్డ్ చేసి రివీల్ చేస్తే బాగుంటుంది కానీ ఇందులో కథనం ఆ కిల్లర్ ఎవరో ముందే ఊహించేసే విధంగానే ఉంటుంది.
అలాగే సినిమాలో ఫస్టాఫ్ కథనం ఒకింత నెమ్మదిగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ మరీ అంత నవ్వు తెప్పించదు. స్క్రీన్ ప్లే లో ఇంకా జాగ్రత్తలు తీసుకొని కథనం ఇంకా ఫాస్ట్ గా నడిపించి ఉంటే బాగుండేది. చాలా వరకు సినిమా స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని పాత్రల్లో లోపాలు కనిపిస్తాయి. అనీష్ కురువిళ్ళ, సియా గౌతమ్ ఇంకొందరికి సినిమాలో అసలు డబ్బింగ్ పొంతన లేకుండా కనిపిస్తుంది. డైలాగ్స్ చాలా చోట్ల మిస్ మ్యాచ్ అయ్యినట్టుగా కనిపిస్తాయి. వీటిలో జాగ్రత్త వహించలేదు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. టెక్నికల్ టీం లో గ్యాని, సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదు అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. మల్లికార్జున సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు మోహన్ విషయానికి వస్తే.. తాను ఇచ్చిన స్టేట్మెంట్ లో కనిపించిన కాన్ఫిడెన్స్ సినిమాలో లోపించింది అని చెప్పక తప్పదు. సినిమాని ఇంకా డెప్త్ ఎమోషన్స్ మంచి థ్రిల్ మూమెంట్స్ తో డిజైన్ చేసి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా వచ్చి ఉండేది. వీటితో తన వర్క్ ఈ చిత్రానికి చాలా ఫ్లాట్ గానే ఉందని చెప్పక తప్పదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” లో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ షైన్ అయ్యారు. కొన్ని కామెడీ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ వరకు ఓకే కానీ ఒక స్పై లేదా డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువ అయ్యాయి. ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ నరేషన్, మంచి ట్విస్ట్ లు యాడ్ చేసి ఉంటే ఈ షెర్లాక్ హోమ్స్ మరింత అలరించేవాడు. సో కొన్ని చోట్ల వరకు ఈ డిటెక్టివ్ ఓకే అనిపిస్తాడు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team