కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “కంగువా” డిజప్పాయింట్ తర్వాత తన కం బ్యాక్ కోసం చాలా మంది ఎదురు చూసున్నారు. అయితే తాను ఇపుడు చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు క్రిస్మస్ కానుకగా మేకర్స్ సాలిడ్ టైటిల్ టీజర్ కట్ ని అందించారు. మరి సూర్యకి సాలిడ్ కం బ్యాక్ అన్న లెవెల్లో ఈ టీజర్ అదిరిపోయింది అని చెప్పాలి. తన ప్రేయసి కోసం తన కోపాన్ని వదిలేసే సీరియస్ ప్రేమికుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ఒకో డైలాగ్ తో కట్ చేసిన ఈ టీజర్ కట్ మాత్రం సూపర్బ్ వర్కౌట్ అయ్యింది అని చెప్పొచ్చు.
దీనితో మాత్రం సూర్య ఖచ్చితంగా గట్టి కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పాల్సిందే. ఇక ఈ టీజర్ లో సూర్య, పూజా హెగ్డేల కెమిస్ట్రీ ముచ్చటగా ఉంటే సంతోష్ నారాయణన్ మంచి స్కోర్ అందించాడు. అన్నట్టు ఈ చిత్రానికి “రెట్రో” అనే క్లాస్ టైటిల్ ని ఆ టైటిల్ కి తగ్గ టీజర్ తో తీసుకొచ్చి వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి