నవీన్ పొలిశెట్టి ‘పెళ్లి’ ఆగిపోలేదు.. కానీ దర్శకుడు లేడా?

నవీన్ పొలిశెట్టి ‘పెళ్లి’ ఆగిపోలేదు.. కానీ దర్శకుడు లేడా?

Published on Dec 25, 2024 12:11 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎంటర్టైనింగ్ జాతి రత్నం నవీన్ పోలిశెట్టి కూడా ఒకడు. తనదైన ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంటున్న ఈ యంగ్ హీరో నుంచి ఎప్పుడో అనౌన్స్ అయ్యిన చిత్రం “అనగనగా ఒక రాజు” కూడా ఒకటి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో మేకర్స్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు అనౌన్స్ చేశారు.

మరి పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా ఊసే లేకుండా పోయింది. కానీ ఫైనల్ గా ఈ పెళ్లి ఆగిపోలేదు ఉంది అంటూ ఓ ప్రీ టీజర్ ప్రోమోతో మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి రేపు డిసెంబర్ 26న వెడ్డింగ్ టీజర్ వదలనున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు కానీ ఈ సినిమా విషయంలో ఎక్కడా దర్శకుడు పేరు లేకుండా సెట్ చేయడం గమనార్హం.

పోస్టర్ లో కానీ టీజర్ లో కానీ సోషల్ మీడియా పోస్ట్ లో కూడా ఎక్కడా దర్శకుడు పేరు లేదు. కేవలం హీరో, నిర్మాణ సంస్థల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీనితో ఇపుడు కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మరి రేపు వచ్చే టీజర్ లో అయినా ఉంటుందో లేదో చూడాలి మరి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు