ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేసి సెన్సేషన్ ని సెట్ చేసింది. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో హిందీ వసూళ్లు ఏ లెవెల్లో ఉంటాయి అనేది కూడా చాలా ఆసక్తికర ప్రశ్నగా మారింది.
మరి ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం ఆ అంచనాలు మించి అక్కడ ఏకంగా మొట్ట మొదటి 700 కోట్ల సినిమాగా నిలిచి ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. ఇలా లేటెస్ట్ గా హిందీలో 715 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని దాటినట్టుగా అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వీక్ డేస్ లో కూడా 10 కోట్లకి పైగా స్టడీ వసూళ్లు ఈ చిత్రం రాబడుతుంది. ఇక ఈ వీకెండ్ కి ఈజీగా 750 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పవచ్చు. మరి చూడాలి పుష్ప గాడి రూలు ఎక్కడ ఆగుతుంది అనేది.