ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. దర్శకుడు సుకుమార్ తరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ మూవీ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.
ఇక ఇటీవల ఈ సినిమా నుండి వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అయిన ఫహాద్ ఫాజిల్‌కు హీరో అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చే సీక్వెన్స్‌లో ఓ సాంగ్ వస్తుంది. ‘దమ్ముంటే పట్టుకోరా’ అంటూ వచ్చే బిట్ సాంగ్‌ను అల్లు అర్జున్ స్వయంగా పాడాడు. ఈ పాటకు సంబంధించిన ఆడియో ట్రాక్‌ను డిసెంబర్ 24న యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
అయితే, ఏమైందో తెలియదు కానీ, ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. అల్లు అర్జున్‌పై కోర్టులో కేసు ఉండటంతోనే పాటను యూట్యూబ్ నుంచి తొలగించి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనికి గల అసలైన కారణం ఏమిటనేది పుష్ప-2 మేకర్స్ మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.