‘డాకు మహారాజ్’ ఫైనల్ రన్‌టైమ్ లాక్ అయ్యిందా..?

‘డాకు మహారాజ్’ ఫైనల్ రన్‌టైమ్ లాక్ అయ్యిందా..?

Published on Dec 25, 2024 11:04 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘డాకు మహారాజ్’ ఫైనల్ రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2 గంటల 24 నిమిషాలకు ఫైనల్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక టైటిల్ క్రెడిట్స్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు కలుపుకుని ఈ చిత్ర రన్ టైమ్ 2 గంటల 32 నిమిషాలకు లాక్ అయినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు