హాట్ టాపిక్‌గా మారిన మహేష్-రాజమౌళి మూవీ.. కారణం ఏమిటంటే?

హాట్ టాపిక్‌గా మారిన మహేష్-రాజమౌళి మూవీ.. కారణం ఏమిటంటే?

Published on Dec 28, 2024 12:31 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆఫ్రికా అడవులు నేపథ్యంలో సాగే ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించనుండటంతో గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడట.

దీంతో ఈ సినిమాకు ప్రియాంక చోప్రా అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని మేకర్స్ ఆమెను ఓకే చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు