Release Date : December 26, 2024
123telugu.com Rating : 2.75/5
నటీనటులు : లీ జంగ్-జే, లీ బ్యుంగ్-హున్, వి హ-జూన్ తదితరులు
దర్శకుడు : హ్వాంగ్ డాంగ్-హ్యుక్
నిర్మాతలు : హ్వాంగ్ డాంగ్-హ్యుక్, కిమ్ జి-యోన్
సంగీతం : జుంగ్ జే-ఇల్
సినిమాటోగ్రఫీ : లీ హ్యోంగ్-డియొక్
ఎడిటర్ : నమ్ నా-యంగ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలతో.. సరికొత్త కథతో, కొత్త ఆటగాళ్లతో, సరికొత్త ఛాలెంజ్‌లతో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
తొలి సీజన్ ‘స్క్విడ్ గేమ్’లో 45.6 బిలియన్ కొరియన్ యన్ గెలిచిన 456 నెంబర్ ఆటగాడు షియెంగ్ జి-హున్(లీ జంగ్-జే)ని ఇతర ప్లేయర్ల మరణాలు వెంటాడుతుంటాయి. తన గెలుపును తాను ఆస్వాదించలేకపోతుంటాడు. ఇలాంటి ప్రమాదకరమైన ఆటలను ఆపేయాలని నిర్ణయించుకుని, తన ప్రైజ్ మనీ ద్వారా ఈ ఆటల వెనుక ఉన్నవారిని కనిపెట్టేందుకు అతడు తిరిగి వస్తాడు. ఒక రిమోట్ ఐల్యాండ్‌లో సీక్రెట్‌గా ఈ గేమ్స్ నిర్వహిస్తున్న హ్వాంగ్ ఇన్-హొ(లీ బ్యుంగ్ హున్)ను ఆయన సోదరుడు, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు డిమోట్ అయిన డిటెక్టివ్ హ్వాంగ్ జన్-హొ(వి హ-జూన్) అన్వేషిస్తుంటాడు. జి-హున్, జన్-హొ దారులు వేరైనా గమ్యం ఒకటే కావడంతో వీరిద్దరు చేతులు కలుపుతారు. అయితే, ఈసారి సరికొత్త ఛాలెంజ్‌లతో, ట్విస్టులతో ఆట మరింత కఠినంగా ఉంటుంది. అయితే, జి-హున్ ఈ ఆటలో చేరడంతో దీని వెనక ఉన్న వ్యక్తి కూడా ఆటలో భాగంగా ఉన్నాడని తెలుసుకుంటాడు. మరి 456 ఆటగాడు ఈ ప్రమాదకరమైన ఆటను ఆపగలిగాడా..? ఈ ఆట వెనకాల అసలు వ్యక్తిని 456 ఆటగాడు కనిపెట్టాడా..? అతడికి డిటెక్టివ్ జున్-హొ ఎలాంటి సాయం అందించాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
స్క్విడ్ గేమ్ సీజన్ 2 సిరీస్ కొత్తరకం ఆటలు, పాత్రలతో ముందుకు సాగుతుంది. తొలి సీజన్‌తో పోలిస్తే ఆటల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులోని ట్విస్టులు సరికొత్త వైవిధ్యాన్ని తీసుకొచ్చాయి. ఇక ఐకానిక్ రెడ్ లైట్, గ్రీన్ లైట్ గేమ్‌కు అదనంగా మరో రెండు కొత్త ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
456 నెంబర్ ఆటగాడిగా లీ జంగ్-జే తన పాత్రకు మరింత ఎమోషనల్ డెప్త్‌ను యాడ్ చేస్తూ నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఫ్రంట్ మ్యాన్‌గా లీ బ్యంగ్ హున్ కంటెస్టెంట్‌గా కథకు బలాన్ని తీసుకొస్తాడు. అతడి ఎత్తులను ప్రేక్షకులు గమనించేలా చేస్తుంటాడు. కొన్ని కొత్త పాత్రలు కూడా ప్రేక్షకులకు ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉంచుతాయి.
ప్రతి ఆట తర్వాత వచ్చే ఓటింగ్ ప్రాసెస్ ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఓటింగ్ ప్రాసెస్ అంశంతో ఆటగాళ్లు ఆటలో కొనసాగుతారా లేదా అని ఆడియెన్స్ లీనమై చూస్తుంటారు.
మైనస్ పాయింట్స్ :
‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’పై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను ఈ వెబ్ సిరీస్ అందుకోలేకపోతుంది. తొలి సీజన్ సెట్ చేసిన స్టాండార్డ్స్‌ను అందుకోవడంలో రెండవ సీజన్ తడబడింది. ఇందులో పరిమితి మేర ఆటలు ఉండటం మేజర్ మైనస్ అని చెప్పాలి. కొన్ని కొత్త ఆటలు ఉన్నా, అవి తొలి సీజన్‌లో వచ్చిన టెన్షన్, ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయలేకపోతాయి.
ఈ సీజన్‌కు సంబంధించిన పేస్ చాలా స్లోగా సాగుతుంది. దీంతో ఆడియెన్స్ ఎంగేజింగ్ అవ్వలేకపోతారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ చాలా ప్రశ్నలకు సమాధానం లేకుండానే ముగిసిందనే భావన కలిగిస్తుంది. ఇది మూడో సీజన్‌కు కొనసాగింపు అనే ఫీలింగ్ కంటే కూడా సరైన ముగింపు రాలేదని ఆడియెన్స్ ఫీల్ అవుతారు.
456 ఆటగాడు ఈ ప్రమాదకరమైన గేమ్స్‌ను ఆపాలనే పాయింట్ చుట్టే కథ నడుస్తుండటం కొంతమేర ఆకట్టుకోదు. ఈ పాయింట్‌ను ఇంకాస్త బలంగా చూపెట్టాల్సింది. ఇక డిటెక్టివ్ పాత్ర కూడా కథకు పెద్దగా చేసిందేమి లేదనే ఫీలింగ్ కలిగిస్తుంది.
ఈ సీజన్‌కు కావాల్సిన క్రేజ్ ప్రేక్షకుల్లో ఉన్నప్పటికీ.. కథలో సస్పెన్స్ లేకపోవడం, స్లోగా కథ బిల్డ్ అవడం, కొన్ని ఎపిసోడ్స్ చాలా వీక్‌గా ఉండటం మైనస్‌గా నిలిచాయి. ఓటింగ్ ప్రాసెస్ ప్రారంభంలో బాగానే అనిపించినా, అది రిపీటెడ్‌గా అనిపిస్తుంది. చాలా సీన్స్ కథలో నెరేషన్‌పైనే సాగడంతో ఓవరాల్ కథకు ఇవి డ్యామేజ్ చేశాయి.
సాంకేతిక విభాగం :
తొలి సీజన్‌తో పోలిస్తే, ఈ రెండో సీజన్ సిరీస్‌కు డైరెక్షన్, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ అంతగా వర్కవుట్ కాలేదని చెప్పాలి. ఈ సీజన్‌లో ఎడిటింగ్ వర్క్.. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్‌లో ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది. అన్ని ఎపిసోడ్స్‌లోనూ సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేసేలా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ మరికొంత శ్రద్ధ తీసుకోవాల్సింది.
తీర్పు :
మొత్తంగా చూస్తే, తొలి సీజన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కారణంగా ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో తడబడింది. మెయిన్ పాత్రధారులు తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా.. స్లో పేస్, పరిమితమైన గేమ్స్, ఫైనల్ ఎపిసోడ్ వంటివి డిజప్పాయింట్ చేస్తాయి. ‘స్క్విడ్ గేమ్ 2’ ఫ్యాన్స్ వరకు ఓకే అనిపించినా, ఇతరులు మాత్రం ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూడటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team