మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్ నటనకు అభిమానులు పట్టం కట్టారు.
ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన దగ్గర్నుండీ సాలిడ్ రెస్పాన్స్ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో నాన్-ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10లో 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు గ్లోబల్ స్థాయిలో ఆడియెన్స్ ఎంతలా ఇంప్రెస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు.