‘కల్కి 2898 ఎడి’ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్!

‘కల్కి 2898 ఎడి’ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్!

Published on Dec 28, 2024 11:56 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి’ చిత్రం సైఫై మైథాలజికల్ కంటెంట్‌తో తెరకెక్కగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ప్రభాస్ పర్ఫార్మెన్స్‌కి అభిమానులు నీరాజనాలు పలికారు.

ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భారీ క్యాస్టింగ్, అదిరిపోయే విజువల్స్, ఆకట్టుకునే కథ ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రిపీటెడ్‌గా చూశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్ అవుతున్న నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో ‘కల్కి 2898 ఎడి’ టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

ఈ మేరకు అధికారికంగా ప్రకటన రావడం తో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు