‘ఎన్టీఆర్ – నెల్సన్’ సినిమా పై క్లారిటీ ఇదే !

‘ఎన్టీఆర్ – నెల్సన్’ సినిమా పై క్లారిటీ ఇదే !

Published on Dec 31, 2024 12:04 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – డైరెక్టర్ నెల్సన్ కలయికలో సినిమా రాబోతుంది అనగానే.. ఈ సినిమా పై భారీగా బజ్ పెరిగింది. పైగా ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘నెల్సన్ – ఎన్టీఆర్ గారి సినిమా కథ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదని.. కేవలం ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని నెల్సన్, మేం ఓ మాట అనుకున్నాం అని, హీరోగారితో నెల్సన్ కి ఒక మీటింగ్ మాత్రమే జరిగింది’ అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం నెల్సన్ కథను రాస్తున్నారని.. ‘వార్ 2’ పూర్తి అయ్యాక, ఎన్టీఆర్ కి నెల్సన్ కథ చెబుతారని.. కథ నచ్చాక, షూటింగ్ గురించి, ఆ సినిమాని ఎలా లాంచ్ చేయాలి, ఏ రేంజ్ లో ప్లాన్ చేయాలి వంటి అంశాల గురించి ఆలోచిస్తాం అని నాగవంశీ చెప్పుకొచ్చారు. తమిళంలో బీస్ట్, జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్, ఎన్టీఆర్ తో సినిమా చేస్తే మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ జోషే. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం తారక్ ‘వార్-2’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు