మొత్తానికి సంక్రాంతి సంబరాలు చూస్తుండగానే ముగిశాయి. ‘గాంధీ తాత చెట్టు’, ‘ఐడెంటిటీ’, ‘స్కైఫోర్స్’, ‘డియర్ కృష్ణ’, ‘హత్య’, ‘తల్లి మనసు’ వంటి భారీ సినిమాలు ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఈటీవీ విన్ :
వైఫ్ ఆఫ్: జనవరి 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
రజాకార్: జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (ఆహా గోల్డ్ యూజర్స్‌కు జనవరి 22 నుంచి)
జీ5 :
హిసాబ్ బరాబర్: జనవరి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
ది నైట్ ఏజెంట్ సీజన్ 2: జనవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (వెబ్‌సిరీస్)
ది సాండ్ క్యాసిల్:జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.