సమీక్ష : పట్టుదల – రోటీన్ గా సాగే యాక్షన్ డ్రామా !

సమీక్ష : పట్టుదల – రోటీన్ గా సాగే యాక్షన్ డ్రామా !

Published on Feb 7, 2025 1:05 AM IST

Ajith Kumar Pattudala Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 06, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అజిత్ కుమార్, త్రిష, అర్జున్, రెజీనా కసాండ్రా, ఆరవ్ తదితరులు.

దర్శకుడు : మగిజ్ తిరుమేని

నిర్మాత : సుభాస్కరన్

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్

ఎడిటర్ : ఎన్.బి. శ్రీకాంత్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

అజిత్ హీరోగా త్రిష హీరోయిన్‌గా నటించిన సినిమా పట్టుదల. మగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

అర్జున్ (అజిత్) కయల్ (త్రిష) ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే, పెళ్లి అయిన 12 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఇద్దరూ విడిపోవడానికి సిద్దపడతారు. ముఖ్యంగా అర్జున్ (అజిత్)కి ఇష్టం లేకపోయినా కయల్ (త్రిష) అతనితో విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఐతే, వక్తులే వేరుంగా ఉంటారు కానీ.. వాళ్ల మనసులు మాత్రం ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కయల్ ను తన పేరెంట్స్ దగ్గర డ్రాప్ చేయడానికి అర్జున్ బై రోడ్ ట్రిప్ వెళ్దాం అంటాడు. ఆ రోడ్ ట్రిప్ లో జరిగిన సంఘటనలు ఏమిటి ?, కయల్ ను ఎవరు కిడ్నాప్ చేస్తారు?, కయల్ కోసం అర్జున్ ఏం చేశాడు ?, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ?, చివరకు వాళ్లిద్దరూ మరింత దగ్గరయ్యే పరిస్థితులు ఎలా వచ్చాయి?, ఈ మొత్తంలో కథలో అర్జున్(రక్షిత్), రెజీనా (దీపిక) పాత్రలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ పట్టుదల సినిమాలో అజిత్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. తన శైలి టైమింగ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ అజిత్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. అజిత్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన లుక్స్ తో అజిత్ సినిమాలోనే హైలైట్ గా నిలిచాడు. హీరోయిన్ గా త్రిష తన నటనతో అలరించింది. ముఖ్యంగా అజిత్ – త్రిష మధ్య సీన్స్ అండ్ ఎమోషన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. రెజీనా కూడా మరో కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన ఆరవ్ తన పాత్రలో ఒదిగిపోయారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాని దర్శకుడు మగిజ్ తిరుమేని బాగానే మలిచాడు. రోడ్ ట్రిప్ సీన్స్ ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు.

మైనస్ పాయింట్స్:

అజిత్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో దర్శకుడు మగిజ్ తిరుమేని విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో అజిత్ – విలన్ అర్జున్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.

ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి మగిజ్ తిరుమేని దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా పూర్తిగా విఫలం అయ్యాడు. మొత్తమ్మీద సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.

సాంకేతిక విభాగం:

ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ఎన్.బి. శ్రీకాంత్ తగ్గించాల్సింది. నిర్మాత సుభాస్కరన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘పట్టుదల’ అంటూ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. అజిత్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే ఎమోషన్స్ పర్వాలేదు. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు