యంగ్ హీరో చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన మూవీ ‘ధూం ధాం’. కాగా ఈ చిత్రం 16 రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఐతే, ఇండియా పరంగా అమెజాన్ స్ట్రీమింగ్‌లో టాప్ 10లో 1వ రోజు… టాప్ 5లో 2వ రోజు, 3వ రోజు, టాప్ 4లో 4వ రోజు, 5వ రోజు… టాప్ 3లో 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు … ఇక మళ్లీ టాప్ 5లో 9వ రోజు… అలాగే, 10వ రోజు టాప్ 3లో.. 11వ రోజు టాప్ 4లో… 12వ రోజు టాప్ 5లో… 13వ రోజు టాప్ 5లో… 14వ రోజు టాప్ 9లో… 15వ రోజు టాప్ 8 … 16వ రోజు టాప్ 9లో ఈ సినిమా నిలుస్తూ రావడం నిజంగా విశేషమే.
ఇండియా పరంగా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా చూసే కామెడీ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ చిత్రం 40 మిలియన్ల మినిట్స్ ను దాటింది. పైగా ఇప్పటికీ మంచి వ్యూస్ ను రాబడుతుంది. ఇందులో భాగంగానే త్వరలో అమెజాన్ వారు ప్రపంచవ్యాప్తంగా 126 కంటే ఎక్కువ దేశాలలో ఈ చిత్రాన్ని అప్‌లోడ్ చేస్తున్నారు. అమెజాన్ స్ట్రీమింగ్‌లో హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా త్వరలో విడుదల చేస్తున్నారు. మా సినిమాను గరిష్ట సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ కావడం మాకు సంతోషంగా ఉంది అంటూ టీం ధన్యవాదాలు తెలిపింది.