తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా, త్రిష హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విడాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’. మేయిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఈ నెల 6న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఐతే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు క్లారిటీ వచ్చింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, అరవ్, నిఖిల్, సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవ రవి, గణేశ్ శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.130 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. కాగా అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్, త్రిష అందం, నటన, అభినయం సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో.. అజిత్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే ఎమోషన్స్ పర్వాలేదు. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించారు. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్, బీజీఎం సినిమాకి ప్లస్ అయ్యాయి.