మన ఇండియన్ సినిమా దగ్గర పలు కల్ట్ క్లాసిక్ సినిమాలు అనే టాపిక్ వస్తే డెఫినెట్ గా వినిపించే టాప్ చిత్రాల్లో బాలీవుడ్ సినిమా “తుంబాడ్” కోసం డెఫినెట్ గా ప్రతీ ఒక్కరూ చెబుతారు. ఎప్పుడో 2018లో థియేటర్స్ లో వచ్చిన ఈ జెమ్ ని అప్పుడు ఎందుకు హిట్ చేసుకోలేకపోయాం అని బాలీవుడ్ జనం చాలా బాధ పడ్డారు. అయితే ఈ సినిమాకి ఫేమ్ ఓటిటికి వచ్చాక ఎక్కువయ్యింది అని చెప్పవచ్చు.
ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో అప్పుడు సొంతం చేసుకోగా మరింత ఆదరణ వచ్చింది. ఇలా వస్తున్న సమయంలోనే ప్రైమ్ వీడియో నుంచి ఈ చిత్రం మాయం అయ్యింది. పైగా ఈ సినిమా అందులో తప్ప ఇక ఏ ఓటిటిలో కూడా లేకపోవడంతో ఓటిటిలో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నవారు బాగా డిజప్పాయింట్ అయ్యారు. కానీ తర్వాత థియేటర్స్ లో రీరిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఫైనల్ గా రికార్డు వసూళ్లు అందుకుంది.
ఇక ఈ సినిమా అప్పటికంటే ఇపుడే ఎక్కువ వసూళ్లు అందుకోగా ఇపుడు ఫైనల్ గా మళ్ళీ ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమాని మళ్ళీ అదే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్ కి ఇటీవల తీసుకొచ్చారు. అప్పుడు లానే హిందీ సహా మన తెలుగులో కూడా ఇపుడు ఈ చిత్రం అందుబాటులో ఉంది. కానీ రీరిలీజ్ కి థియేటర్స్ లో వేసిన ప్రింట్ లో పార్ట్ 2 కోసం ఇచ్చిన హింట్ మాత్రం ఇందులో మిస్ చేశారు. సో మొదట ఉన్న ప్రింట్ నే మళ్ళీ ఇపుడు స్ట్రీమింగ్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి మళ్ళీ ఈ కల్ట్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ట్రై చెయ్యండి.