ఓటిటిలో కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం”

ఓటిటిలో కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం”

Published on Mar 2, 2025 5:00 PM IST

మన టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. నెవర్ బిఫోర్ వసూళ్లు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకి పైగా రికార్డు వసూళ్లు సాధించింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓటిటి రిలీజ్ సహా టెలివిజన్ ప్రీమియర్ గా కూడా వచ్చింది.

అయితే ఈ చిత్రంని జీ5 వారు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తే ఓటిటిలో కూడా సంక్రాంతికి వస్తున్నాం రికార్డులు బ్రేక్ చేయడం మొదలు పెట్టింది. జీ 5 హిస్టరీ లోనే కేవలం 6 గంటల్లోనే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ వ్యూస్ అందుకుంటే 12 గంటల్లో 1.3 మిలియన్ కి పైగా వ్యూస్ జీ5 లో అందుకుందట. దీనితో ఓటిటిలో కూడా సంక్రాంతికి వస్తున్నాం కొత్త రికార్డులు సెట్ చేస్తుంది అని చెప్పాలి. ఇక దీనితో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఈ రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు