తెలుగులో “ఛావా” 5 రోజుల వసూళ్లు ఎంతంటే!

తెలుగులో “ఛావా” 5 రోజుల వసూళ్లు ఎంతంటే!

Published on Mar 12, 2025 1:56 PM IST

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ హిస్టారికల్ హిట్ చిత్రం “ఛావా”. మొదటిగా హిందీ ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నార్త్ లో సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రం హిందీ తర్వాత మరో భాషలో డబ్బింగ్ చేయాలి అనేది ఒక్క మన తెలుగులో తప్ప మరే భాషలో కూడా డిమాండ్ రాలేదు.

ఇలా తెలుగులో మంచి డిమాండ్ తో ఎట్టకేలకి తెలుగులో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇలా తెలుగులో మొత్తం ఇపుడు 5 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా పి ఆర్ నంబర్స్ ప్రకారం ఛావా మొత్తం 11.91 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో తెలుగులో కూడా ఛావా మంచి రన్ ని ప్రదర్శిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు