‘ఛాంపియన్’ గ్లింప్స్.. స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్న రోషన్

‘ఛాంపియన్’ గ్లింప్స్.. స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్న రోషన్

Published on Mar 13, 2025 1:01 PM IST

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోగా తన మార్క్ వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే, ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్‌లో చేస్తున్నాడు రోషన్. ఇక ఈ సినిమాను ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్‌ను రోషన్ పట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో రోషన్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 90ల కాలంనాటి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలవనున్నట్లు ఈ గ్లింప్స్ బీజీఎం చెబుతోంది.

ఈ సినిమాలోని నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాను ప్రియాంక దత్, జికె.మోహన్, జెమిని కిరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు